IPL: ఢిల్లీ బౌలర్ల సంచలన ప్రదర్శన... గుజరాత్ 89 పరుగులకే ఢమాల్

Gujarat Titans bundled out for 89 runs
  • అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • 17.3 ఓవర్లలోనే కుప్పకూలిన గుజరాత్
  • ఐపీఎల్ లో తమ అత్యల్ప స్కోరు నమోదు చేసిన టైటాన్స్

ఇవాళ గుజరాత్ టైటాన్స్ తో పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచ్చారు. టాస్ గెలిచిన కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకోగా... ఢిల్లీ బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ఇదే అత్యల్ప స్కోరు. 

ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 3, ఇషాంత్ శర్మ 2, ట్రిస్టాన్ స్టబ్స్ 2, ఖలీల్ అహ్మద్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ చూస్తే... లోయర్ ఆర్డర్ లో రషీద్ ఖాన్ చేసిన 31 పరుగులే అత్యధికం. 

సాయి సుదర్శన్ 12, రాహుల్ తెవాటియా 10 పరుగులు చేశారు. మిగతా అంతా సింగిల్ డిజిట్ కే చేతులెత్తేశారు. సాహా (2), కెప్టెన్ శుభ్ మాన్ గిల్ (8), డేవిడ్ మిల్లర్ (2), అభినవ్ మనోహర్ (8), షారుఖ్ ఖాన్ (0) ఘోరంగా విఫలమయ్యారు.

  • Loading...

More Telugu News