Lok Sabha Polls: ప్రియాంక, రాహుల్ గాంధీలను చూసే బదులు కజిరంగా పార్కుకు వెళ్లడం మంచిదని ప్రజలు భావిస్తున్నారు: అసోం సీఎం

  • అమూల్ బేబీలను చూసేందుకు ప్రజలు ఎందుకు వెళతారని ఎద్దేవా
  • గాంధీ కుటుంబానికి చెందిన నేతలను చూడటం వల్ల ఎలాంటి లాభం లేదని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్య
  • అందుకే ఇటీవలి ప్రియాంక గాంధీ ర్యాలీలో జనాలు లేరన్న హిమంత బిశ్వ శర్మ
Assam CM satires on Priyanka Gandhi and Rahul Gandhi

కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు. గాంధీ కుటుంబానికి చెందిన వీరిద్దరూ అమూల్ బేబీలు అని ఎద్దేవా చేశారు. అమూల్ బేబీలను చూసేందుకు మా అసోం ప్రజలు ఎందుకు వెళతారు? ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార ర్యాలీలు, సభలకు బదులు కజిరంగా నేషనల్ పార్కుకు వెళ్లడం మంచిదని ప్రజలు భావిస్తారని వ్యంగ్యంగా అన్నారు.

తనకు తెలిసినంత వరకు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌తో కలిసి ప్రియాంక గాంధీ ఇటీవల చేపట్టిన ర్యాలీలో కేవలం రెండు మూడు వేల మంది మాత్రమే పాల్గొన్నారన్నారు. గాంధీ కుటుంబం నేతలను చూడటం వల్ల ఎలాంటి లాభం లేదని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే ప్రియాంక గాంధీ రోడ్డు షోలో అసలు జనాలే లేరన్నారు.

  • Loading...

More Telugu News