Akhilesh Yadav: ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు బీజేపీ కొట్టుకుపోవడం ఖాయం: అఖిలేశ్ యాదవ్

  • బీజేపీ చేసిన ప్రతి హామీ ఉత్తిదే అన్న అఖిలేశ్ యాదవ్
  • తొలి దశ ఎన్నికలు దేశగతిని మారుస్తాయన్న మాజీ ముఖ్యమంత్రి
  • దళితులు, మైనార్టీలు, పేదలు బీజేపీని ఓడించడం ఖాయమని వ్యాఖ్య
బీజేపీ చేసిన ప్రతి హామీ ఉత్తిదేనని సమాజ్‌వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు బీజేపీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. బుధవారం ఆయన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ చేసిన ప్రతి హామీ ఉత్తిదే అన్నారు. పశ్చిమం నుంచి వీస్తున్న గాలి బీజేపీకి వ్యతిరేకంగా ఉందన్నారు. తొలి దశ ఎన్నికలు దేశగతిని మారుస్తాయన్నారు.

ఇప్పుడు మేం ఘజియాబాద్‌‌లో ఉన్నామని... ఇండియా కూటమి ఘాజీపూర్ వరకు అద్భుత విజయం సాధిస్తుందని, బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. దళితులు, మైనార్టీలు, బీసీలు, పేదలు అందరు కలిసి ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఖాయమన్నారు.
Akhilesh Yadav
BJP
Rahul Gandhi

More Telugu News