Meat Shops: సిటీలో ఆదివారం మటన్ షాపుల బంద్.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు

  • మహావీర్ జయంతి సందర్భంగా ఉత్తర్వులు
  • కబేళాలు, మాంసం దుకాణాలన్నీ బంద్ పెట్టాలని ఆర్డర్
  • జైనుల ముఖ్యమైన పండుగలలో మహావీర్ జయంతి ఒకటి
Meat Shops Will be closed This Sunday In Hyderabad

ఆదివారం చికెన్, మటన్ షాపుల ముందు రద్దీ మామూలుగా ఉండదు.. సాధారణంగా ఆదివారం పూట చాలా ఇళ్లల్లో మాంసం వంటకాల ఘుమఘుమలు కనిపిస్తాయి. సండే స్పెషల్ అంటే నాన్ వెజ్ మాత్రమే అనేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అయితే, ఈ ఆదివారం మాత్రం హైదరాబాద్ వాసులు మాంసాహారం తినడం కుదరదు. ఎందుకంటే.. ఈ నెల 21న సిటీలోని అన్ని కబేళాలతో పాటు మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. ఈమేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను ఆదివారం బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మహావీర్ జయంతి సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. జైనులు జరుపుకునే పండుగలలో మహావీర్ జయంతి అత్యంత ముఖ్యమైన పండుగ.. ఈ నేపథ్యంలోనే మహావీరుడి జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని కబేళాలతో పాటు మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించినట్లు రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News