IPL: ఐపీఎల్ లో ఇవాళ నెంబర్ వన్, నెంబర్ టు మధ్య నువ్వా? నేనా?

  • ఐపీఎల్ లో నేడు ఆసక్తికర సమరం
  • ఈడెన్ గార్డెన్స్ లో రాజస్థాన్ రాయల్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
Rajasthan Royals takes of KKR

ఐపీఎల్ లో నేడు ఆసక్తికర సమరం జరుగుతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, రెండో స్థానంలో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్ అందుబాటులో ఉండడం రాజస్థాన్ రాయల్స్ కు లాభించే అంశం. మరోవైపు, సొంతగడ్డపై ఆడుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. టోర్నీలో ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు సాధించగా, కోల్ కతా నైట్ రైడర్స్ 5 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు నమోదు చేసింది.

ఇరు జట్లలో గమనించదగ్గ ఆటగాళ్లు...

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హెట్మెయర్, జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, చహల్.

కోల్ కతా నైట్ రైడర్స్: ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్, ఆండ్రీ రసెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

  • Loading...

More Telugu News