Chandrababu: స్కిల్ కేసు: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

  • చంద్రబాబుపై స్కిల్ కేసు
  • రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఐడీ
Hearing adjourned in skill case seeking cancellation of Chandrababu bail

స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. అయితే ఈ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై గత నెల 19న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బెంచ్... నేడు పూర్తి స్థాయి విచారణ షురూ చేసింది.

జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇప్పటికే చార్జిషీట్ దాఖలైందని సీఐడీ తరఫు న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకు తెలియజేశారు. ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరారు. 

చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని, ఆయన కుమారుడు లోకేశ్ రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారని న్యాయవాది రంజిత్ కుమార్ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి వివరించారు. అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ లో పేర్లున్న వారి అంతు చూస్తామని హెచ్చరికలు చేస్తున్నారని తెలిపారు. 

ఈ అంశంపై కోర్టులో ఐఏ దాఖలు చేశామని పేర్కొన్నారు. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను మే 7కి వాయిదా వేసింది.

More Telugu News