Wedding Reception: దర్శకుడు శంకర్ కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు కుటుంబ సమేతంగా హాజరైన చిరంజీవి, రామ్ చరణ్

  • అసిస్టెంట్ డైరెక్టర్ తో శంకర్ కుమార్తె వివాహం
  • ఘనంగా పెళ్లి రిసెప్షన్
  • సందడి చేసిన మెగా ఫ్యామిలీ
  • నూతన వధూవరులకు శుభాకాంక్షలు
Chiranjeevi and Ram Charan attends Shankar daughter wedding reception

దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్ తో నిన్న చెన్నైలో ఘనంగా జరిగింది. కాగా శంకర్ కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. 

చిరంజీవి, కొణిదెల సురేఖ, రామ్ చరణ్, ఉపాసన ఈ వేడుకలో సందడి చేశారు. నూతన వధూవరులు ఐశ్వర్య-తరుణ్ కార్తీక్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. శంకర్ దంపతులతో ముచ్చటించారు. 

ప్రస్తుతం రామ్ చరణ్... శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News