K Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

  • తన అరెస్ట్ అక్రమమంటూ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత
  • సెలవులో ఉన్న ప్రత్యేక కోర్టు జడ్జి
  • దీంతో 22 లేదా 23వ తేదీకి వాయిదాపడిన విచారణ
Kavitha bail petition plea postponed

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సెలవులో ఉన్నారు. దీంతో ఆమె విచారణ వాయిదా పడింది. ఈ నెల 22న లేదా 23వ తేదీన న్యాయస్థానం వాదనలు విననుంది. మద్యం కేసులో తాను నిర్దోషినని, తనపై అక్రమంగా కేసు పెట్టారని, కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ జడ్జి సెలవులో ఉండటంతో వాయిదాపడింది. సీబీఐ తనను అరెస్ట్ చేసిన కేసులోనూ కవిత నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా 22వ తేదీన విచారణ జరగనుంది.

More Telugu News