Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

  • శిరోముండనం కేసులో 18 నెలల జైలు శిక్ష, రూ. 2.50 లక్షల జరిమానా
  • 28 ఏళ్ల తర్వాత వెలువడిన తీర్పు
  • త్రిమూర్తులు సహా మరో ఆరుగురికి శిక్ష
Jail term for YSRCP MLC Thota Trimurthulu

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు షాకిచ్చింది. శిరోముండనం కేసులో ఆయనకు 18 నెలల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు రూ. 2.50 లక్షల జరిమానా విధించింది. త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు ఈ శిక్షను విధించింది. 28 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడటం గమనార్హం. 1996 డిసెంబర్ 29న ఐదుగురు దళితులను హింసించి, వారిలో ఇద్దరికి శిరోముండనం చేశారు. గుండు కొట్టించడంతో పాటు కనుబొమ్మలను కూడా తీసేశారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనాన్ని రేకెత్తించింది.

More Telugu News