Police Vaari Heccharika: శరవేగంగా పాటల చిత్రీకరణ జరుపుకొంటున్న ‘పోలీసువారి హెచ్చరిక’

  • నల్లపూసలు ఫేం బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా
  • ప్రధాన పాత్రల్లో అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, సాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్ తదితరులు
  • అరకు, యారాడ బీచ్ కాఫీవనం వంటి లొకేషన్లలో పాటల చిత్రీకరణ
  • సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘గజ్వేల్ వేణు’
Police Vaari Heccharika now busy in song shoots

‘నల్లపూసలు’ ఫేం బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పోలీసు వారి హెచ్చరిక’ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీని తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్దన్ నిర్మిస్తున్నారు. అఖిల్ సన్నీ , అజయ్ ఘోష్ , రవి కాలే , సాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్ , కాశీ విశ్వనాథ్ , సంజయ్ నాయర్, జబర్దస్త్ వినోద్ , జబర్దస్త్ పవన్ , హిమజ , జయ వాహిని , శంకరాభరణం తులసి, మేఘనా ఖుషి , రుచిత తదితరులు నటిస్తున్నారు. 

పాటల చిత్రీకరణ సందర్భంగా దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ.. సినిమాలోని పాటలను అరకులోయ, కాఫీవనం, ఆపిల్ రిసార్ట్స్, యారాడ బీచ్, నకిరేకల్ ల్యాండ్స్ వంటి లొకేషన్లలో చిత్రీకరించినట్టు తెలిపారు. ప్రైవేట్ సాంగ్స్‌కు సంగీతాన్ని సమకూర్చే ‘గజ్వేల్ వేణు’ను ఈ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. నిర్మాత బెల్లి జనార్ధన్ మాట్లాడుతూ..  రెండు రోజుల్లో పాటల చిత్రీకరణ పూర్తి అవుతుందని, ఆ వెంటనే నల్గొండలో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News