AP Volunteers: కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో 1,500 మంది వాలంటీర్ల రాజీనామా

1500 volunteers resigned in Konaseema district Mandapet constituency

  • ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరం పెట్టిన ఎన్నికల సంఘం
  • వైసీపీ కోసం స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్న పలువురు వాలంటీర్లు
  • జగన్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్న మాజీ వాలంటీర్లు

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. వాలంటీర్ల సేవలను ఎన్నికల సందర్భంగా ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. అయితే, ఎన్నికల విధులకు వాలంటీర్లను ఎన్నికల సంఘం దూరం పెట్టింది. దీంతో, వైసీపీకి అనుకూలంగా ఉన్న పలువురు వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా ప్రచార రంగంలోకి దిగుతున్నారు. 

తాజాగా కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో దాదాపు 1,200 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. జగన్ ను మళ్లీ సీఎం చేయాలంటే వైసీపీ కార్యకర్తల్లా మారి పార్టీ కోసం పని చేయాలని వీరు నిర్ణయించుకున్నారు. జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారి ఓట్లు వైసీపీకి పడేలా వీరు కృషి చేయనున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతాలను రూ. 10 వేలకు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News