Revanth Reddy: ఇంట గెలిచి రచ్చ గెలవాలి.. ఇక్కడ తప్పిదం జరిగితే నేను జాతీయస్థాయిలో చెప్పుకునే పరిస్థితి ఉండదు: రేవంత్ రెడ్డి

Revanth Reddy in Narayanapet Jana Jathara meeting
  • ఉమ్మడి పాలమూరు జిల్లాలో మెజార్టీ సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారన్న రేవంత్ రెడ్డి
  • నన్ను పెంచి పోషించింది మీరే... అలాంటి నన్ను నరుకుతా అంటే మీరు నరకనిస్తారా? అన్న ముఖ్యమంత్రి
  • మీరు పెంచిన చెట్టు మహా వృక్షమై పండ్లు ఇచ్చింది... ఇప్పుడూ మీ చేతుల్లోనే ఉందని వ్యాఖ్య
'ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి... నా పాలమూరులో తప్పిదం జరిగితే (కాంగ్రెస్ ఓడిపోతే) నేను జాతీయస్థాయిలో చెప్పుకునే పరిస్థితి ఉంటుందా? ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు ఇచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేశారు.. నన్ను పెంచి పోషించింది మీరే... ఈరోజు నన్ను నరుకుతా అంటే మీరు నరకనిస్తారా?' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

నారాయణపేట జనజాతర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఈ చెట్టును (తనను తాను ఉద్దేశించుకొని) నాటింది మీరు... పెంచింది మీరు...  అని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు. మీరు పెంచిన చెట్టు మీకు నీడను ఇస్తుంటే నరకనిస్తారా? అన్నారు. మీరు పెంచిన చెట్టు మహా వృక్షమై పండ్లు ఇచ్చిందని... ఇప్పుడూ మీ చేతుల్లోనే ఉందన్నారు.
Revanth Reddy
Congress
Lok Sabha Polls

More Telugu News