Travis Head: ట్రావిస్ హెడ్ సంచలన శతకం... భారీ స్కోరు దిశగా సన్ రైజర్స్

  • ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ వర్సెస్ బెంగళూరు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
  • 39 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసుకున్న హెడ్
  • ఈ సీజన్ లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ
  • తొలి వికెట్ కు 108 పరుగులు జోడించిన హెడ్, అభిషేక్ శర్మ
Travis Head sensation century drives SRH to massive total

ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం తప్పని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 

ఓపెనర్ ట్రావిస్ హెడ్ రికార్డు సెంచరీతో సంచలన బ్యాటింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. ఈ సీజన్ లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. హెడ్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. అతడి విజృంభణతో బెంగళూరు బౌలర్లు దిక్కులు చూశారు. హెడ్ ఏ బౌలర్ ను కూడా వదలకుండా కొట్టాడు. 

ఈ మ్యాచ్ లోనూ హెడ్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ విధ్వంసం కొనసాగింది. ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు తొలి వికెట్ కు 108 పరుగులు జోడించి తిరుగులేని పునాది వేశారు. అభిషేక్ శర్మ 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు చేశాడు. 

ప్రస్తుతం సన్ రైజర్స్ స్కోరు 12 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 158 పరుగులు. ట్రావిస్ హెడ్ 102, హెన్రిచ్ క్లాసెన్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

More Telugu News