Sathyam Rajesh: ఉత్కంఠను పెంచుతున్న కంటెంట్ .. 'టెనెంట్'

Tenant Movie Update
  • 'సత్యం' రాజేశ్ హీరోగా రూపొందిన 'టెనెంట్'
  • సస్పెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ 
  • ఈ నెల 19వ తేదీన సినిమా విడుదల 
  • ఆసక్తిని పెంచుతున్న ట్రైలర్

సత్యం రాజేశ్ హీరోగా ఈ మధ్య కాలంలో వచ్చిన 'మా ఊరి పొలిమేర' సినిమా, భారీ విజయాన్ని అందుకుంది. ఆయన హీరోగా చేసిన మరో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'టెనెంట్' రెడీ అవుతోంది. మహాతేజ క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి యుగంధర్ దర్శకత్వం వహించాడు. మేఘ చౌదరి - చందన - భరత్ కాంత్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ నెల 19వ తేదీన థియేటర్లకు ఈ సినిమా రానుంది. 

రీసెంటుగా ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్తగా పెళ్లైన జంట .. వేరు కాపురం .. అందమైన జీవితం. ఎన్నో ఆశలతో ఆ జంట కొత్తకాపురాన్ని మొదలుపెడుతుంది. ఆనందంగా .. అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలోకి అతని వైపు నుంచి మరదలు .. ఆమె వైపు నుంచి ఒక ఫ్రెండ్ ఎంటరవుతారు. ఆ ఇద్దరితో పాటే ఈ దంపతుల మధ్య అపోహలు .. అపార్థాలు మొదలవుతాయి. 

అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? వాళ్ల జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేది కథ. ఒక వైపున క్రైమ్ .. మరోవైపున సస్పెన్స్ .. ఇంకోవైపున రొమాన్స్ తో కూడిన ఈ సినిమాపై బజ్ పెరుగుతూ వచ్చింది. చూడాలి మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనేది.

  • Loading...

More Telugu News