Arvind Kejriwal: కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడంపై ఈడీకి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు

  • లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ
  • కేజ్రీవాల్ అరెస్ట్ ను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
  • హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేజ్రీవాల్ 
SC issues notice to ED over Kejriwal arrest

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే, తనను ఈడీ అరెస్ట్ చేయడం, రిమాండ్ విధించడం తదితర పరిణామాలపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ ను ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని తన పిటిషన్ లో సవాల్ చేశారు. 

కేజ్రీవాల్ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన కారణాలు, తదితర పరిణామాలపై వివరణ ఇవ్వాలంటూ ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 24 లోపు వివరణ ఇవ్వాలంటూ సుప్రీం ధర్మాసనం ఈడీని ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.

More Telugu News