Election Commission: లోక్ సభ ఎన్నికలు... రోజుకు రూ.100 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఈసీ

Seizures Worth Rs 100 Cr Being Made Every Day To Check Influence Of Money Power In Polls
  • మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు రూ.4,650 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఈసీ
  • గతంలోని అన్ని ఎన్నికల రికార్డులను అధిగమించినట్లు తెలిపిన ఈసీ
  • 75 ఏళ్ల లోక్ సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికమని వెల్లడి
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు రూ.4,650 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. అంటే సగటున రోజుకు రూ.100 కోట్లు సీజ్ చేసింది. నగదు స్వాధీనంలో గతంలోని అన్ని ఎన్నికల రికార్డులను అధిగమించినట్లు ఈసీ ప్రకటించింది.

75 ఏళ్ల లోక్ సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొంది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో రూ.3475 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. 18వ లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభం కానుంది.
Election Commission
ECI
Lok Sabha Polls

More Telugu News