Rohit Sharma: క్యాచ్ కోసం వెళ్లిన‌ రోహిత్ శ‌ర్మ ప్యాంట్ జారిపోయింది.. మ్యాచ్‌లో ఫ‌న్నీ ఇన్సిడెంట్‌.. వీడియో వైర‌ల్‌!

  • వాంఖ‌డేలో సీఎస్‌కే వ‌ర్సెస్ ఎంఐ మ్యాచులో ఘ‌ట‌న‌
  • చెన్నై ఇన్నింగ్స్ 12వ ఓవ‌ర్‌లో ఫ‌న్నీ ఇన్సిడెంట్‌ 
  • చెన్నై బ్యాట‌ర్ రుతురాజ్ గైక్వాడ్ ఆడిన షాట్..
  • బాల్‌ను క్యాచ్ చేసే క్ర‌మంలో జారిన హిట్‌మ్యాన్ ప్యాంట్
Rohit Sharma Pant came while Fielding during MI Vs CSK Match

వాంఖ‌డేలో ఆదివారం నాటి సీఎస్‌కే వ‌ర్సెస్ ఎంఐ మ్యాచులో ఓ ఫ‌న్నీ ఇన్సిడెంట్ తాలూకు వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్ ప‌ట్టే క్ర‌మంలో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ప్యాంట్ జారిపోవ‌డం వీడియోలో మ‌నం చూడొచ్చు. చెన్నై ఇన్నింగ్స్ 12వ ఓవ‌ర్‌లో ఈ ఫ‌న్నీ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

చెన్నై బ్యాట‌ర్ రుతురాజ్ గైక్వాడ్ ఆడిన షాట్.. రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ చేస్తున్న వైపు గాల్లో లేచింది. దాంతో ఆ బంతిని క్యాచ్ ప‌ట్టుకునే క్ర‌మంలో హిట్‌మ్యాన్ ప్యాంట్ జారిపోయింది. క్యాచ్ కోసం రోహిత్ తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అది దొర‌క‌పోగా ప్యాంట్ జారింది. 

ఇక కింద‌ప‌డిన బంతిని కీప‌ర్ వైపు త్రో చేసిన అనంత‌రం రోహిత్ త‌న ప్యాంట్‌ను స‌ర్దుకోవ‌డం వీడియోలో ఉంది. ఈ ఫ‌న్నీ ఇన్సిడెంట్ తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. హిట్‌మ్యాన్ క్యాచ్ కోసం శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించిన తీరును క్రికెట్ అభిమానులు మెచ్చుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ అజేయ శ‌త‌కం (105) తో రాణించినా ముంబై విజ‌య‌తీరాల‌కు చేరలేకపోయింది.

More Telugu News