K Kavitha: కవితను తీహార్ జైలుకు తరలించిన పోలీసులు

  • కవిత జ్యుడీషియల్ కస్టడీ 
  • ఈ నెల 23 వరకు కస్టడీ 
  • ఇది బీజేపీ కస్టడీ అని మండిపడ్డ కవిత
Kavitha sent to Tihar jail

ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 9 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను విధించింది. ఈ నెల 23 వరకు కస్టడీకి ఇస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. జ్యుడీషియల్ కస్టడీ నేపథ్యంలో ఆమెను పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు, కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్న సమయంలో కవిత మాట్లాడుతూ... బీజేపీ నేతలు బయట మాట్లాడుతున్న మాటలనే... సీబీఐ అధికారులు అడుగుతున్నారని... కొత్త ప్రశ్నలేవీ అడగడం లేదని విమర్శించారు. ఇది సీబీఐ కస్టడీ కాదని... బీజేపీ కస్టడీ అని దుయ్యబట్టారు.

More Telugu News