Sayaji Shinde: ఆరోగ్యంగానే ఉన్నా.. మళ్లీ వచ్చి ఎంటర్‌టైన్ చేస్తా: సాయాజీ షిండే

Im healthy will come back and entertain says Sayaji Shinde
  • చాతీనొప్పితో ఈ నెల 11న ఆసుపత్రిలో చేరిన సాయాజీ షిండే
  • గుండెలో కుడివైపున 99 శాతం బ్లాక్స్ గుర్తించి యాంజియోప్లాస్టీ చేసిన వైద్యులు
  • త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ఆకాంక్ష
అనారోగ్యం కారణంగా ఇటీవల ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు సాయాజీ షిండే కోలుకుంటున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలిపారు. త్వరలోనే వచ్చి అభిమానులను అలరిస్తానని పేర్కొన్నారు. ఆయన పోస్టుపై స్పందిస్తున్న అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

చాతీనొప్పితో బాధపడుతూ ఈ నెల 11న సాయాజీ షిండే మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.  పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెలో కుడివైపున 99 శాతం బ్లాక్స్ గుర్తించి వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. జేడీ చక్రవర్తి నటించిన ‘సూరి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సాయాజీ షిండే అతడు, పోకిరి సహా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగువారికి దగ్గరయ్యారు.
Sayaji Shinde
Tollywood
Bollywood
Chest Pain
Angioplasty

More Telugu News