Israel-Iran War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. భారత్ స్పందన ఇదీ

  • ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు శాంతికి విఘాతం కలిగిస్తాయన్న భారత్
  • సంయమనం పాటించాలని హితవు
  • దౌత్యమార్గం ద్వారా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని సూచన
India Concerned Israel Iran War And Responds

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు ప్రారంభించడంపై భారత్ స్పందించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పశ్చిమాసియా ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ తీవ్రతను తగ్గించాలని, సంయమనం పాటించాలని కోరింది. హింస ద్వారా కాకుండా దౌత్యమార్గం ద్వారా సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కోవాలని సూచించింది. 

ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపింది. ఈ దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలు భారతీయ సమాజంతో టచ్‌లో ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. డమాస్కస్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో ఆత్మరక్షణ కోసమే దాడులు ప్రారంభించినట్టు ఇరాన్ చెబుతోంది. మరోవైపు, ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లను కూల్చివేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లను కూల్చివేయడంలో ఇజ్రాయెల్‌కు సాయం చేస్తున్నట్టు అమెరికా తెలిపింది.

More Telugu News