BJP Manifesto: నేడే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

  • న్యూఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో ఆవిష్కరణ
  • కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు
  • అభివృద్ధి, దేశ శ్రేయస్సు, సంక్షేమం ఎజెండగా మేనిఫెస్టో రూపకల్పన
BJP to release manifesto for LS polls on Sunday in presence of PM Modi

మరోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న బీజేపీ నేడు ‘సంకల్ప పత్రం’ పేరిట ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హాజరుకానున్నారు. భారత రాజ్యాంగ రూపశిల్పి డా. బీఆర్ అంబేద్కర్ జన్మదినమైన ఆదివారం రోజున బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుండటం గమనార్హం 

‘మోదీ గ్యారెంటీ: 2047 నాటికి వికసిత్ భారత్’ అనే థీమ్‌తో..అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా బీజేపీ తన మేనిఫెస్టోను రూపొందించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అధికారంలో ఉన్న గత రెండు పర్యాయాల్లో వివిధ రంగాల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను మేనిఫెస్టోలో చేర్చారు. మూడో పర్యాయం బీజేపీ అధికారంలోకి వస్తే దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని పొందుపరిచారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు రోడ్ మ్యాప్ కూడా మేనిఫెస్టోలో చేర్చారు. 

మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజల సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రధాని మోదీ గతంలో దేశవ్యాప్త క్యాంపెయన్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో ‘నమో’ యాప్ ద్వారా ప్రజలు తెలియజేసిన సలహాలను మేనిఫెస్టోలో చేర్చినట్టు తెలుస్తోంది. దేశాభివృద్ధి కారక కార్యక్రమాలన్నీ పూర్తి చేసేలా బీజేపీకి మరో పర్యాయం అధికారం ఇవ్వాలని ప్రజలను
మేనిఫెస్టోలో పార్టీ కోరింది.

More Telugu News