Rahul Gandhi: స్టాలిన్ కోసం రోడ్డు దాటి వెళ్లి స్వీట్స్ కొన్న రాహుల్.. వీడియో షేర్ చేసిన రేవంత్

  • చెన్నై పర్యటనలో ఉన్న రాహుల్
  • రోడ్డు డివైడర్ ను దాటుకుని వెళ్లిన వైనం
  • ప్రేమ మాత్రమే దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని నమ్మే నాయకుడని రేవంత్ కితాబు
Rahul Gandhi purchased sweets for Stalin

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెన్నై పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రోడ్డు ఇటువైపు నుంచి డివైడర్ దాటుకుని అవతలికి వెళ్లిన రాహుల్ ఓ స్వీట్ షాపులోకి వెళ్లారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఇచ్చేందుకు స్వీట్లు కొన్నారు. ఈ వీడియోను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఒకనాడు ఇదే గడ్డపై తండ్రిని కోల్పోయిన రాహుల్ గాంధీ.. ప్రేమ మాత్రమే ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని నమ్మే ఒక బలమైన నాయకుడు అని రేవంత్ అన్నారు. దీనికి చిన్ని ఉదాహరణే ఈ సన్నివేశం అని చెప్పారు. 

More Telugu News