మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

  • తిరుమలాయపాలెం మండలం సరిహద్దుల్లో వాహనం చెక్ చేసిన పోలీసులు
  • లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న కోడ్
  • వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు, ఎన్నికల అధికారులు
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సరిహద్దుల్లో ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు. శనివారం ఆయన తిరుమలాయపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మం నుంచి వెళుతున్న సమయంలో మాదిరిపురం వద్ద మంత్రి వాహనాన్ని పోలీసులు చెక్ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు వాహనాలను చెక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పొంగులేటి వాహనాన్ని చెక్ చేశారు. ఆయన తనిఖీలకు పూర్తిగా సహకరించారు.
Go Back to Shorts
Ponguleti Srinivas Reddy
Telangana
Police
Lok Sabha Polls

More Telugu News