Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఐపీఎల్‌లో తొలి ఆటగాడిగా అరుదైన‌ రికార్డు!

  • అతి త‌క్కువ బంతుల్లో (2028) 3 వేల ర‌న్స్ చేసిన ఆట‌గాడిగా పంత్‌
  • అత‌ని త‌ర్వాతి స్థానంలో యూసుఫ్ ప‌ఠాన్ (2062), సూర్య‌కుమార్ యాద‌వ్ (2130), సురేశ్ రైనా (2135)
  • అలాగే అతి పిన్న వ‌య‌సులో 3వేల ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో రిషభ్‌కు మూడో స్థానం
Fewest balls to reach 3000 IPL runs by Indian players

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అతి త‌క్కువ బంతుల్లో మూడు వేల ప‌రుగులు పూర్తి చేసిన బ్యాట‌ర్‌గా రికార్డుకెక్కాడు. ఈ 3వేల ప‌రుగుల మార్క్‌ను పంత్ కేవ‌లం 2028 బంతుల్లోనే అందుకున్నాడు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో శుక్ర‌వారం నాటి మ్యాచ్‌లో 41 ప‌రుగులు చేసి, ఈ రికార్డును నెల‌కొల్పాడు. 

అత‌ని త‌ర్వాతి స్థానంలో యూసుఫ్ ప‌ఠాన్ (2062), సూర్య‌కుమార్ యాద‌వ్ (2130), సురేశ్ రైనా (2135), మ‌హేంద్ర సింగ్ ధోనీ (2152) ఉన్నారు. అంతేగాక ఢిల్లీ ఫ్రాంచైజీ త‌ర‌ఫున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కూడా పంతే ఉండ‌డం విశేషం.  

అలాగే అతి పిన్న వ‌య‌సులో 3వేల ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో పంత్ (26 ఏళ్ల 191 రోజులు) మూడో స్థానంలో నిలిచాడు. అత‌నికంటే ముందు శుభ్‌మ‌న్ గిల్ (24 ఏళ్ల 215 రోజులు), విరాట్ కోహ్లీ (26 ఏళ్ల 186 రోజులు) ఈ ఫీట్‌ను సాధించ‌డం జ‌రిగింది. 

ఇదిలాఉంటే.. 2022 డిసెంబ‌ర్‌లో కారు ప్ర‌మాదం త‌ర్వాత దాదాపు 15 నెల‌ల పాటు క్రికెట్‌కు దూర‌మైన రిష‌భ్‌ పంత్.. ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో పున‌రాగ‌మ‌నం చేసి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆరు మ్యాచులు ఆడి రెండు అర్థ శ‌త‌కాల సాయంతో 194 ప‌రుగులు చేశాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 104 మ్యాచులు ఆగిన పంత్ 3032 ప‌రుగులు చేశాడు. ఇందులో 17 హాఫ్ సెంచ‌రీలు, ఒక సెంచ‌రీ ఉన్నాయి. వ్య‌క్తిగ‌త అత్య‌ధిక స్కోర్ వ‌చ్చేసి 128 (నాటౌట్‌).     

More Telugu News