అందుకే రేవంత్ రెడ్డి తనపై కుట్రలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
- కాంగ్రెస్ నేతలు ఆందోళన, అభద్రతాభావానికి గురవుతున్నారని వ్యాఖ్య
- హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్న బీజేపీ నేత
- హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఒవైసీని గెలిపించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందన్న లక్ష్మణ్
కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా లోక్ సభ ఎన్నికలతో ముడిపెట్టడం సరికాదన్నారు. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీని గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయినా బీఆర్ఎస్ నేతల అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థులను మార్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. త్వరలో కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.