K Kavitha: కవితకు చుక్కెదురు.. సీబీఐ అరెస్ట్ ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత

  • సీబీఐ అరెస్ట్, విచారణపై రెండు పిటిషన్లు వేసిన కవిత
  • రెండు పిటిషన్లను కొట్టేసిన కోర్టు
  • కాసేపట్లో సీబీఐ కస్టడీపై తీర్పు వెలువరించనున్న కోర్టు
Delhi Court dismesses two petitions of Kavitha

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురయింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు ఆమె పిటిషన్లను కొట్టి వేసింది. తనను అరెస్ట్ చేయడం, తనను ప్రశ్నించడం రెండు అంశాలపై ఆమె రెండు పిటిషన్లు వేశారు. ఈ రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. మరోవైపు, కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ పై కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్ పై తీర్పును జడ్జి రిజర్వ్ లో పెట్టారు. కాసేపట్లో తీర్పును వెలువరించనున్నారు. ఒకవేళ కవితను కోర్టు కస్టడీకి ఇస్తే... ఆమెను సీబీఐ కార్యాలయానికి తరలిస్తారు.

More Telugu News