Puranapanda Srinivas: భద్రాద్రిలో 14న ‘శ్రీరామరక్షా స్తోత్రం’ ఆవిష్కరణ.. నవమి నాడు భక్తులకు పంపిణీ

  • శ్రీరామ నవమి ఉత్సవాల కోసం ముస్తాబవుతున్న భద్రాచలం
  • పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘శ్రీరామరక్షా స్తోత్రం’ గ్రంథాన్ని సమర్పిస్తున్న ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణ, సాయి కొర్రపాటి
  • గ్యాలరీలో కూర్చుని రామయ్య కల్యాణాన్ని వీక్షించే భక్తులకు పంపిణీ
Sri Rama Raksha Stotram Will Be Released On 14th This Month In Badradri Temple

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీరామ నవమి ఉత్సవాల కోసం ముస్తాబవుతోంది. ఆ రోజున జరిగే రామయ్య కల్యాణ క్రతువును కనులారా వీక్షించేందుకు కోట్లాదిమంది భక్తులు తహతహలాడుతుంటారు. కల్యాణం కోసం ఈసారి అద్భుతంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎల్. రమాదేవి తెలిపారు. ఈసారి వేడుకల్లో ఓ ప్రత్యేకత కనిపించనుంది. గ్యాలరీలో కూర్చుని కల్యాణాన్ని వీక్షించే వేలాదిమంది భక్తులకు ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘శ్రీరామరక్షా స్తోత్రం’ గ్రంథాన్ని పంపిణీ చేయనున్నారు. 

భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలకు గతంలో టాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘వారాహి చలన చిత్రం’ అధినేత సాయి కొర్రపాటి సమర్పించిన అఖండ గ్రంథాలను రచించింది కూడా శ్రీనివాస్ కావడం గమనార్హం. ఇక, తాజా గ్రంథమైన  ‘శ్రీరామరక్షా స్తోత్రం’ పుస్తకాన్ని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, సాయి కొర్రపాటి సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి పురాణపండ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ మహిమోపేత శ్రీరామరక్షా స్తోత్రం గ్రంథాన్ని ఎల్లుండి (14న) ఆలయ ఈవో రమాదేవి ఆవిష్కరిస్తారు.

More Telugu News