IPL 2024: భారీ టార్గెట్ ఇచ్చిన ఆర్సీబీ... ముంబయి దూకుడు

  • వాంఖెడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసిన బెంగళూరు
RCB set Mumbai Indians 197 runs target

ముంబయి వాంఖెడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత  20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (61), రజత్ పాటిదార్ (50), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించారు. 

విరాట్ కోహ్లీ (3) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరినప్పటికీ, డుప్లెసిస్, పాటిదార్ జోడీ ఆదుకుంది. చివర్లో దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు నమోదు చేసింది. దినేశ్ కార్తీక్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

విల్ జాక్స్ (8), మ్యాక్స్ వెల్ (0) విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు సాధించడం విశేషం. కోట్జీ 1, మధ్వాల్ 1, శ్రేయాస్ గోపాల్ 1 వికెట్ తీశారు. 

అనంతరం, 197 పరుగుల లక్ష్యఛేదనలో ముంబయి ఇండియన్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ జట్టు 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 55, రోహిత్ శర్మ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

More Telugu News