Rahul Gandhi: కాంగ్రెస్ గెలిస్తే పరిశ్రమలు, మీడియా, బ్యూరోక్రసీ వంటి వివిధ రంగాల్లో జనగణన చేపడతాం: రాహుల్ గాంధీ

  • దళితులు, గిరిజనులు, బీసీలు, పేద సాధారణ తరగతి వారు ఎంత శాతం ఉన్నారో లెక్కిస్తామని వెల్లడి
  • రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ
  • కుల ఆధారిత జనాభా లెక్కల ద్వారా పాలు ఏవో... నీరు ఏవో తెలిసిపోతుందని వ్యాఖ్య
Rahul Gandhi Promises Caste based Census in Various Sectors

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే పరిశ్రమలు, మీడియా, బ్యూరోక్రసీ వంటి వివిధ రంగాల్లో కుల ప్రాతిపదికన జన గణన చేపడతామని ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, పేద సాధారణ తరగతి వారు ఎంత శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసుకోవడానికి మీడియా, కంపెనీలు, బ్యూరోక్రసీ వంటి ప్రతి సంస్థను తనిఖీ చేస్తామన్నారు. ఆయన రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కుల ఆధారిత జనాభా లెక్కల ద్వారా, పాలు ఏవో... నీరు ఏవో తెలిసిపోతుందన్నారు. ఆర్థిక సర్వే చేస్తామన్నారు.

మొదట, ఎవరికి ఎక్కువ సహాయం అవసరమో తెలుసుకోవడానికి... వివిధ కులాలకు చెందినవారు ఎంతమంది ఉన్నారో లెక్కిస్తామన్నారు. ఆ తర్వాత, దేశం ఆర్థికంగా ఎలా పని చేస్తుందో పరిశీలించి, డబ్బు, ఉద్యోగాలు, ఇతర ప్రయోజనాలను జనాభా ఆధారంగా పంచడానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

More Telugu News