Jr NTR: వార్-2 చిత్రీకరణ కోసం ముంబయి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్

  • తొలిసారిగా బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్
  • హృతిక్ రోషన్ ప్రధానపాత్రలో వార్-2
  • కీలకపాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్
Jr NTR arrives for War2 shooting

టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం వార్-2. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న వార్-2 చిత్రానికి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. కాగా, వార్-2 షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబయి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. 

ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దేవర ఈ ఏడాది అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తున్నారు. వార్-2 చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఓ గూఢచారి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

More Telugu News