YS Sharmila: మోసానికే బ్రాండ్ అంబాసడర్ జగన్: షర్మిల

Jagan is brand ambassador for fraud says YS Sharmila
  • జాబు కావాలంటే జగన్ కావాలనే ఘరానా మోసానికి తెరలేపారన్న షర్మిల
  • ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మ విమర్శ చేసుకోవాలని ఎద్దేవా
  • గౌరవంగా చెప్పుకునే ఒక్క ఉద్యోగాన్నైనా భర్తీ చేశారా అని ప్రశ్న
ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. జాబు కావాలంటే బాబు రావాలని చంద్రబాబు గతంలో మోసం చేశారని... ఇప్పుడు జాబు రావాలంటే జగన్ కావాలని జగన్ రెడ్డి ఘరానా మోసానికి తెర లేపారని దుయ్యబట్టారు. 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 23 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని గద్దెనెక్కిన వీరు ఈ ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

 ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, జంబో డీఎస్సీ, ఎపీపీఎస్సీ నుంచి వరుస నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి, నిరుద్యోగులను నమ్మించి నిండా ముంచారని దుయ్యబట్టారు. మోసానికే బ్రాండ్ అంబాసడర్ జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ అవసరాల కోసం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి 2 లక్షల ఉద్యోగాలను ఇచ్చామని చెప్పుకోవడం తప్ప... గౌరవంగా చెప్పుకునే ఒక్క ఉద్యోగాన్నైనా భర్తీ చేశారా అని ప్రశ్నించారు. ఇప్పటికే వివిధ శాఖల పరిధిలో 2.25 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని... ఇది జగన్ మార్క్ పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
YS Sharmila
Congress
Jagan
YSRCP

More Telugu News