VH: సీఎం రేవంత్ రెడ్డి బాగా పని చేస్తున్నారు: వి.హనుమంతరావు కితాబు

VH praises CM Revanth Reddy for his job
  • తాను రేవంత్ రెడ్డికి మద్దతివ్వడం కొందరికి నచ్చడం లేదని వ్యాఖ్య
  • తనకు ఖమ్మం లోక్ సభ టిక్కెట్ ఇస్తే గెలిచినట్లేనన్న వీహెచ్
  • భట్టివిక్రమార్క మొదట తనకు టిక్కెట్ ఇవ్వమని చెప్పి.. ఇప్పుడు తన భార్యకు అడుగుతున్నాడని విమర్శ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కితాబునిచ్చారు. ఆయన బాగా పని చేస్తున్నారన్నట్లు చెప్పారు. గురువారం ఏబీఎన్ ఛానల్‌తో మాట్లాడుతూ... తాను సీఎంకు మద్దతుగా ఉండటం కొందరికి నచ్చడం లేదన్నారు. కానీ ఆయన బాగా పని చేస్తున్నాడు కాబట్టే మద్దతును ఇస్తున్నానని తెలిపారు. తనకు పార్టీ అధిష్ఠానం ఖమ్మం లోక్ సభ టిక్కెట్ ఇస్తే తన కోసం పని చేస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నారని పేర్కొన్నారు.

తనది కాంగ్రెస్ పార్టీ రక్తమని, ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని అడిగినట్లు చెప్పారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా తాను తిరుగుబాటు చేయబోనన్నారు. 2019లో ఖమ్మం నుంచి పోటీకి ప్రయత్నించినట్లు చెప్పారు. ఖమ్మం నుంచి పోటీ చేయడం కోసం అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా చేసినట్లు చెప్పారు. తనకు ఖమ్మం టిక్కెట్ ఇస్తే గెలిచినట్లేనని ధీమా వ్యక్తం చేశారు.

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తనను ఖమ్మంలో పోటీ చేయమని మొదట చెప్పి... ఇప్పుడు తన భార్యకు టిక్కెట్ కావాలని అడుగుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అధిష్ఠానం ఎవరికి టిక్కెట్ ఇస్తే వారికి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
VH
Revanth Reddy
Congress
Lok Sabha Polls

More Telugu News