యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా అఖిలేశ్ యాదవ్ కూతురు
- మైన్ పురీ నుంచి పోటీ చేస్తున్న అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్
- తల్లికి మద్దతుగా ప్రచారం చేస్తున్న కూతురు అదితీ యాదవ్
- అదితిని చూసేందుకు ఉత్సాహం చూపుతున్న ప్రజలు
పదునైన ప్రసంగాలు చేస్తూ అదితి ఓటర్లను ఆకట్టుకుంటోంది. ఆమెను చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. అదితి లండన్ లో చదువుకుంటున్నారు. సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆమె... తల్లి కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. ములాయం సింగ్ మరణానంతరం మైన్ పురీ స్థానం నుంచి పోటీ చేసి డింపుల్ విజయం సాధించారు. ప్రస్తుతం మైన్ పురీ ఎంపీగా ఆమె ఉన్నారు. ఈసారి ఎన్నికలు ఆమెకు అంత సులభం కాదని విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో, ఆమె బీజేపీని, ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.