Moto G64: మోటరోలా నుంచి సరికొత్త మోటో జీ64 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ప్రత్యేకతలు ఇవే

  • ఏప్రిల్ 16న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల
  • మూడు రంగుల్లో.. రెండు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో మార్కెట్లోకి రానున్న స్మార్ట్‌ఫోన్
  • సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన మోటరోలా
Moto to launch Moto G64 5G smartphone next week

స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం మోటరోలా భారత మార్కెట్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మోటో జీ64 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా గురువారం ప్రకటించింది. ఏప్రిల్ 16న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ను లాంఛ్ చేయబోతున్నట్టు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ఈ ఫోన్ విక్రయం కోసం ఫ్లిప్‌కార్ట్‌పై మైక్రోసైట్‌ను కూడా క్రియేట్ చేసినట్టు పేర్కొంది. మోటరోలా ఇండియా వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. 

ప్రత్యేకతలు ఇవే...
కాగా మోటో జీ64 5జీ ఫోన్ బ్లూ, గ్రీన్, పర్పుల్ మూడు రంగుల్లో లభిస్తుందని తెలిపింది. ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ7025 ఎస్‌వోసీ ప్రోసెసర్‌తో తయారు చేశారు. 8జీబీ + 128జీబీ,  12జీబీ + 256జీబీ అనే రెండు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఇక స్మార్ట్‌ఫోన్ టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.5-అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, కెమెరా ముందు భాగంలో 50ఎంపీ ప్రధాన సెన్సార్, 8ఎంపీ మాక్రో షూటర్‌, వెనుకవైపు డ్యుయెల్ కెమెరాను ఉంటుంది. ఇక 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌‌తో రానుంది. కాగా ఈ ఫోన్ ధరకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

More Telugu News