ప్రియమణి నడుముపై చేయి వేసిన బోనీకపూర్ పై నెటిజన్ల ఫైర్
- 'మైదాన్' సినిమాను నిర్మించిన బోనీకపూర్
- బాలీవుడ్ సెలబ్రిటీల కోసం స్పెషల్ షో
- ప్రియమణి భుజం, నడుముపై చేతులు వేసి పోజులిచ్చిన బోనీ
అదే సమయంలో ప్రియమణి వచ్చింది. చీరలో ఆమె చాలా అందంగా కనిపించింది. ఆమెకు బోనీకపూర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులివ్వాలని ఫొటోగ్రాఫర్లు అడగగా... ఇద్దరూ పోజులిచ్చారు. అయితే ప్రియమణి భుజం, నడుముపై చేతులు వేసి బోనీ పోజులిచ్చారు. ప్రియమణి నడుముపై చేయి వేయడం చాలా మంది నెటిజన్లకు నచ్చలేదు. ఆమెను అసభ్యంగా తాకారంటూ ఏకిపారేస్తున్నారు.
ఇద్దరు కూతుళ్లున్న వ్యక్తి ఒక మహిళతో ఇలా నీచంగా ఎలా ప్రవర్తిస్తారని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని మరొకరు వ్యాఖ్యానించారు. సిగ్గులేని మొరటు వృద్ధుడు అని మరొకరు విమర్శించారు. బాలీవుడ్ లో ఇదంతా కామన్ అని మరికొందరు అంటున్నారు.