Revanth Reddy: రేవంత్ రెడ్డి ఎక్స్ ఖాతాలో కనిపించకుండా పోయిన బ్లూటిక్ మార్క్

Blue tick missed in revanth reddy x account
  • బ్లూటిక్ లేకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ నెటిజన్ల పోస్టులు
  • రేవంత్ రెడ్డి ప్రొఫైల్ మార్చడంతో సాంకేతిక సమస్య ఏర్పడి కనిపించకుండా పోయిన బ్లూటిక్
  • మరో రెండు రోజుల్లో పునరుద్ధరించబడుతుందన్న ప్రతినిధులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ ఖాతాలో బ్లూటిక్ మార్క్ కనిపించకుండా పోయింది. సీఎం అధికారిక ఖాతాకు బ్లూటిక్ మార్క్ లేకపోవడంపై నెట్టింట చర్చ సాగింది. బ్లూటిక్ లేకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు.

అయితే రేవంత్ రెడ్డి తన ప్రొఫైల్ మార్చడంతో సాంకేతిక సమస్య ఏర్పడి బ్లూటిక్ మార్క్ కనిపించకుండా పోయినట్లుగా ముఖ్యమంత్రి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తోన్న ప్రతినిధులు వెల్లడించారు. మరో రెండు రోజుల్లో బ్లూటిక్ మార్క్ పునరుద్ధరించబడుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఫోటోకు బదులు రాహుల్ గాంధీతో కలిసి టార్చ్ పట్టుకొని నడిచిన ఫోటోను పెట్టారు.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News