Posani Krishna Murali: సావర్కర్ అంటే గవాస్కర్ అనుకుంటున్నారేమో... పురందేశ్వరిపై పోసాని సెటైర్లు

  • చంద్రబాబు ఒక రకం అనుకుంటే పురందేశ్వరి వంద రకాలు అంటూ పోసాని విమర్శలు
  • ఆర్ఎస్ఎస్ అంటే కూడా పురందేశ్వరికి తెలియదని వ్యాఖ్యలు
  • చంద్రబాబు గతంలో వాలంటీర్లపై పడి ఏడ్చారని విమర్శ 
Posani satires on Purandeswari

టాలీవుడ్ నటుడు, ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మరోసారి వైసీపీకి మద్దతుగా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై ధ్వజమెత్తారు. 

చంద్రబాబు ఒక రకం అనుకుంటే, పురందేశ్వరి వంద రకాలు అని విమర్శించారు. బీజేపీలో ఉంటూ కూడా ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలియని వ్యక్తి పురందేశ్వరి... వీర సావర్కర్ అంటే సునీల్ గవాస్కర్ అనుకుంటున్నారేమో అని పోసాని వ్యంగ్యం ప్రదర్శించారు. 

సీఎం జగన్ పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన పురందేశ్వరి... మోసాలకు పాల్పడిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ లపై ఎందుకు లేఖ రాయలేదని సూటిగా ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా పోసాని వాలంటీర్ల అంశాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై పడి ఏడ్చారని విమర్శించారు. వాలంటీర్లపై చంద్రబాబుకు కన్ను కుట్టిందని అన్నారు. వాలంటీరు వ్యవస్థను అడ్డంపెట్టుకుని ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆ మధ్య కన్నీళ్లు కార్చారని తెలిపారు. మగ వాలంటీర్లు ఇంట్లో ఆడవాళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి తలుపు కొడుతుంటారని, ఆ ఆడవాళ్లను మగ వాలంటీర్లు ఏం చేస్తారోనని చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 

వాలంటీర్లు అంటే చంద్రబాబు దృష్టిలో గోతాలు మోసేవాళ్లని తెలిపారు. మగ వాలంటీర్లు నారా లోకేశ్ లాగా తాగుబోతులు, తిరుగుబోతులు కాదని అన్నారు. చంద్రబాబు, లోకేశ్ తీర్థయాత్రలకు వెళ్లాలని, ఏపీలో అందరూ సంతోషంగా ఉంటారని పోసాని పేర్కొన్నారు.

More Telugu News