K Kavitha: సీబీఐ ప్రశ్నించడంపై కవిత పిటిషన్.. విచారణ వాయిదా

  • జైల్లో విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి
  • తమ వాదనలు వినకుండానే సీబీఐకి అనుమతినివ్వడంపై కవిత పిటిషన్
  • తదుపరి విచారణ ఏప్రిల్ 26కి వాయిదా
Kavitha petition on CBI qustioning

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. కవితను జైల్లో విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతించింది. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సవాల్ చేశారు. నోటీసులు ఇవ్వకుండానే కవితను విచారించారని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సీబీఐ నుంచి తమకు కౌంటర్ రిప్లై అందలేదని కవిత తరపు లాయర్ చెప్పగా... ఆ అవసరం లేదని సీబీఐ బదులిచ్చింది. శనివారమే (ఏప్రిల్ 6) కవితను తాము ప్రశ్నించామని... కాబట్టి కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. 

అయితే.. భవిష్యత్తులో జరిగే విచారణకు కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని సీబీఐని జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది. కవితను తీహార్ జైల్లో విచారించేందుకు సీబీఐకి ఏప్రిల్ 5న కోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే, తమ వాదనలు వినకుండానే సీబీఐకి అనుమతిని ఇవ్వడాన్ని కోర్టులో కవిత సవాల్ చేశారు. 

More Telugu News