Drugs In Sanathnagar: సనత్ నగర్ లో డ్రగ్స్ పట్టివేత.. ఐదుగురి అరెస్ట్

MDMA Drugs Seized In SanathNagar Five youth Arrested
  • ఎస్ వోటీ పోలీసుల తనిఖీలో ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం
  • గోవా నుంచి తిరిగి వస్తూ డ్రగ్స్ తెచ్చిన యువకులు
  • పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్న అధికారులు
పుట్టిన రోజు వేడుక జరుపుకోవడానికి గోవా వెళ్లిన యువకులు.. పార్టీలోనూ డ్రగ్స్ వినియోగించారు, తిరిగొస్తూ వెంట కూడా తెచ్చుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్ వో టీ అధికారులు దాడి చేయగా.. పది గ్రాముల డ్రగ్స్ దొరకడంతో ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని సనత్ నగర్ లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సిటీలో పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్ సనత్ నగర్ వరకూ పాకిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారనే సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ వోటీ పోలీసులు బుధవారం సనత్ నగర్ లో సోదాలు చేపట్టారు. ఓ ఇంట్లో ఎండీఎంఏ డ్రగ్స్ ను గుర్తించి సీజ్ చేశారు. 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ తో పాటు 5 గ్రాముల గంజాయి, ఓసీబీ ఫ్లేవర్స్ డ్రగ్స్ సీజ్ చేశారు. ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఎండీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Drugs In Sanathnagar
NDMA Drug
Ganja
Goa
Birthday Party
Five Youth Arrest

More Telugu News