Sri Vishnu: ఈ శుక్రవారం ఓటీటీకి వస్తున్న తెలుగు సినిమాలివే!

  • ఈ నెల 12 నుంచి జీ 5లో 'గామి' స్ట్రీమింగ్
  • డిఫరెంట్ లుక్ తో విష్వక్ మెప్పించిన సినిమా  
  • అదే రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో 'ఓం భీమ్ బుష్'
  • హాస్యంతో అలరించిన కంటెంట్ 
  • ఆహా నుంచి పలకరించనున్న 'ప్రేమలు'
  • రొమాంటిక్ లవ్ స్టోరీతో మార్కులు కొట్టేసిన మూవీ

OTT Movies Update

ఈ శుక్రవారం ఓటీటీ సెంటర్ లో సందడి కాస్త గట్టిగానే కనిపించనుంది. మూడు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఆ జాబితాలో 'గామి' .. 'ఓం భీమ్ బుష్' .. 'ప్రేమలు' కనిపిస్తున్నాయి. విష్వక్సేన్ హీరోగా విద్యాధర్ రూపొందించిన 'గామి', మార్చి 8వ తేదీన థియేటర్లకు వచ్చింది. విభిన్నమైన సినిమాగా ఆడియన్స్ నుంచి మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రానుంది. ఇక ఇదే రోజున అమెజాన్ ప్రైమ్ వీడియోలో ' ఓం భీమ్ బుష్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. శ్రీవిష్ణు - ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, మార్చి 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, నాన్ స్టాప్ కామెడీని అందించింది. అయేషా ఖాన్ గ్లామర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇక 'ప్రేమలు' విషయానికి వస్తే, విడుదలైన ప్రతి భాషలో ఈ సినిమా విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుందా అని ఎదురుచూసేవారు ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా 'ఆహా' తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఈ నెల 12వ తేదీ నుంచి పలకరించనుంది. 135 కోట్ల వరకూ కొల్లగొట్టిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి. 

More Telugu News