విశాఖ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సత్యారెడ్డి.. ఆయనెవరో తెలుసా?
- సత్యారెడ్డి స్వస్థలం గుంటూరు
- స్థిరపడింది మాత్రం విశాఖలో
- గతంలో తెలుగుసేన పార్టీ స్థాపన
- ఉద్యమ నేపథ్యం కలిగిన 53 సినిమాల నిర్మాణం
- స్వీయ దర్శకత్వంలో ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా
గతంలో తెలుగుసేన పార్టీని స్థాపించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటి వరకు ఆయన ఉద్యమ నేపథ్యం కలిగిన 53 సినిమాలు నిర్మించారు. విశాఖ ఉక్కు నిర్వాసితులతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆయన స్వీయ దర్శకత్వంలో ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా నిర్మించారు. అందులో ఆయన స్టీల్‌ప్లాంట్ ఉద్యమనేతగా కథానాయకుడి పాత్ర పోషించారు. ఈ సినిమాలో ప్రజా గాయకుడు, దివంగత గద్దర్ కూడా నటించారు.