Cable Bridge: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై వాహనం నిలిపితే వేయి రూపాయల ఫైన్

  • బ్రిడ్జ్ పై ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్న జనాలు
  • వాహనాలు ఆపడం కారణంగా బ్రిడ్స్ పై ట్రాఫిక్ రద్దీ
  • బ్రిడ్జ్ పై కేట్ కటింగ్ లు బ్యాన్
Rs 1000 fine for vehicle parking on Hyderabad cable bridge

హైదరాబాద్ దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ కి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్రిడ్జ్ పై ఫొటోలు దిగేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో బ్రిడ్జ్ పై టూవీలర్స్ ను పార్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. బ్రిడ్జ్ పై ఆదివారం జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇకపై బ్రిడ్జ్ పై వాహనాన్ని ఆపితే రూ. 1000 జరిమానా విధిస్తామని పోలీసులు తెలిపారు. ప్రమాదాల నివారణకే ఈ జరిమానాలు అని చెప్పారు. బ్రిడ్జి వరకు వచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవచ్చని... బర్త్ డే కేక్ లు కట్ చేయడం మాత్రం కుదరదని స్పష్టం చేశారు. బ్రిడ్జ్ పై కేక్ కటింగ్స్ బ్యాన్ చేశామని తెలిపారు. వాహనదారులు ఈ మార్పును గమనించాలని కోరారు. బ్రిడ్జ్ వద్ద ఎక్కువ మంది పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు.

More Telugu News