Election Commission: ముప్పు పొంచి ఉండటంతో... చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

  • సీఈసీకి రక్షణ కల్పించనున్న సాయుధ కమాండో దళాలు
  • ఎన్నికల నేపథ్యంలో పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం
  • సీఈసీకి పూర్తి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్స్ చేసిన భద్రతా ఏజెన్సీలు
Chief Election Commissioner Gets Z Tier Security Amid Threats

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరీ కింద వీఐపీ భద్రతను కల్పించారు. ఆయనకు సాయుధ కమాండో దళాలు పూర్తి రక్షణ కల్పిస్తాయి. ఎన్నికల నేపథ్యంలో పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా ఆయనకు పూర్తి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి భద్రతా ఏజెన్సీలు ఇటీవల సిఫార్స్ చేశాయి.

దీనిని పరిశీలించిన హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 40 నుంచి 45 మంది సిబ్బంది సీఈసీ రక్షణ విధుల్లో ఉంటారు. రాజీవ్ కుమార్ 2020లో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. మే 15, 2022న ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.

More Telugu News