K Kavitha: కవిత రిమాండ్ పొడిగించాలన్న ఈడీ.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

Court reserves verdict in Kavitha judicial custody extension
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత
  • మార్చి 26 నుంచి తీహార్ జైల్లో ఉన్న కవిత
  • నేటితో ముగిసిన జ్యుడీషియల్ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈ రోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు. దీనిపై కోర్టు తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ. 100 కోట్లు చెల్లించినట్టు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు... ఆ తర్వాత కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో, మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు.  
K Kavitha
BRS
Delhi Liquor Scam
Enforcement Directorate
Judicial Custody

More Telugu News