Rajeev Ratan: సీనియర్‌ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హ‌ఠాన్మ‌ర‌ణం!

Senior IPS Vigilance DG Rajeev Ratan Dies of Heart attack

  • గుండెపోటుతో క‌న్నుమూసిన రాజీవ్ ర‌త‌న్‌
  • ప్రస్తుతం తెలంగాణ‌ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా బాధ్య‌త‌లు
  • గతంలో కరీంనగర్ ఎస్పీగా, ఆపరేషన్ ఐజీగా, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా విధులు

సీనియర్‌ ఐపీఎస్ అధికారి రాజీవ్‌ రతన్ మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయ‌న‌ ప్రస్తుతం తెలంగాణ‌ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కొనసాగుతున్నారు. ఉదయం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయ‌న‌ను ఏఐజీ ఆసుప‌త్రికి తరలించారు. అక్క‌డ‌ చికిత్స పొందుతూ ఆయ‌న‌ చ‌నిపోయారు. 1991 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ కేడ‌ర్‌ ఐపీఎస్ అధికారి రాజీవ్ ర‌త‌న్‌. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా పని చేశారు. అలాగే ఆపరేషన్ ఐజీగా, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశారు.

Rajeev Ratan
Heart attack
IPS
Telangana
  • Loading...

More Telugu News