కంటోన్మెంట్ ప్రజల కోసం రిజర్వాయర్‌ను నిర్మిస్తాం: ఈటల రాజేందర్

  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో పూర్తిగా విఫలమైందని ఆరోపణ
  • బీజేపీ గెలిచాక ఇళ్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ
  • విమానాశ్రయం దగ్గరలో ఉన్న వారికి పట్టాలు ఇప్పిస్తామన్న ఈటల
సికింద్రాబాద్ లోక్ సభ స్థానంలో బీజేపీ గెలిచాక కంటోన్మెంట్ ప్రజల కోసం రిజర్వాయర్‌ను నిర్మిస్తామని మల్కాజ్‌గిరి లోక్ సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానంలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో పూర్తిగా విఫలమైందన్నారు. తాము గెలిచాక ఇళ్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విమానాశ్రయం దగ్గరలో ఉన్న వారికి పట్టాలు ఇప్పిస్తామన్నారు. కంటోన్మెంట్ ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... అందుకే రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు.

Etela Rajender
Telangana
Congress

More Telugu News