balakrish: తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna wishes on Ugadi
  • రేపే తెలుగువారి నూతన సంవత్సర పండుగ ఉగాది
  • ఉగాది పర్వదిన వేడుకల కోసం సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు
  • ఈ ఉగాది ప్రతి ఒక్క తెలుగు వారి జీవితాల్లో ఉషస్సులు నింపాలని ఆకాంక్షించిన బాలయ్య
రేపు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకోబోతున్నారు. ఉగాది సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఊరు కొత్త సంవత్సర శోభను సంతరించుకున్నాయి. పండుగను జరపుకునేందుకు అందరూ కావాల్సిన పూజ సామగ్రిని, ఉగాది పచ్చడికి కావాల్సిన అన్నింటిని సమకూర్చుకున్నారు. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. 

balakrish
Telugudesam
Ugadi

More Telugu News