YS Sharmila: అందుకే మీ రాజన్న బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తోంది: వైఎస్ షర్మిల

YS Sharmila on YSRCP
  • ఎన్నికల ప్రచారంలో జగన్ ను, వైసీపీని టార్గెట్ చేస్తున్న షర్మిల
  • రాష్ట్రంలో దౌర్జన్యాలు, అక్రమాలు పెరిగిపోయాయని విమర్శ
  • ధర్మం వైపు నిలబడాలని ఓటర్లకు విన్నపం
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె తన నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో ఆమె తన అన్న, సీఎం జగన్ ను నేరుగా టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య ఉదంతాన్ని ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. తాజాగా ఈరోజు ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ... మరోసారి వైసీపీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అక్రమాలు పెరిగిపోయాయని అన్నారు. అక్రమాలను ఎదుర్కోవడానికే మీ రాజన్న బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తోందని చెప్పారు. ధర్మం వైపు నిలబడాలని ఓటర్లను కోరారు. తనను ఆశీర్వదించాలని, గెలిపించాలని ట్వీట్ చేశారు.
YS Sharmila
Congress
YSRCP
AP Politics

More Telugu News