IPL 2024: ఐపీఎల్: లక్నో బ్యాటర్లకు కళ్లెం వేసిన గుజరాత్ టైటాన్స్ బౌలర్లు

  • లక్నోలో గుజరాత్ టైటాన్స్ × లక్నో సూపర్ జెయింట్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో జట్టు
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు
  • కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన గుజరాత్ బౌలర్లు
Gujarat Titans bowlers restricts LSG batters

సొంతగడ్డపై ఆడుతున్నప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్ మెన్ పెద్దగా రాణించలేకపోయారు. ఇవాళ లక్నోలో గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

మార్కస్ స్టొయినిస్ 58, కెప్టెన్ కేఎల్ రాహుల్ 33 పరుగులు, ఆయుష్ బదోనీ 20 పరుగులు చేశారు. ఆఖర్లో నికోలాస్ పూరన్ 32 పరుగులు చేశాడు. పూరన్ 3 సిక్సులు కొట్టాడు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో బ్యాటర్లు భారీ స్కోర్లు నమోదు చేయలేకపోయారు. ఆఖరి ఓవర్లోనూ అదే పంథా కొనసాగింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్ చేయగా, ఆ ఓవర్లో కేవలం 8 పరుగులే వచ్చాయి. 

లక్నో ఇన్నింగ్స్ లో ఓపెనర్ క్వింటన్ డికాక్ (6), దేవదత్ పడిక్కల్ (7) విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 2, దర్శన్ నల్కండే 2, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.

More Telugu News