Live In Relationship: పెళ్లి చేసుకోకున్నా సహజీవన భాగస్వాగస్వామికి భరణం చెల్లించాల్సిందే.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

  • విడిపోయిన భాగస్వామికి ప్రతినెల రూ. 1500 చెల్లించాలన్న కిందికోర్టు
  • హైకోర్టులో సవాలు చేసిన పిటిషనర్
  • సహజీవనానికి ఆధారాలు లేవన్న కారణంతో భరణాన్ని నిరాకరించలేమన్న హైకోర్టు
  • లివిన్ రిలేషన్‌షిప్ ముగిసినా మహిళను ఉత్తచేతులతో వదిలివేయడానికి లేదని స్పష్టీకరణ
Madhyapradesh High Court Sensational Verdict On Alimony For Live In Partner

స్త్రీపురుషుల మధ్య లివిన్ రిలేషన్‌షిప్ ముగిసినప్పటికీ మహిళను ఉత్తచేతులతో వదిలివేయడానికి లేదని, ఆమెకు మనోవర్తి చెల్లించాల్సిందేనని మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆమెను చట్టబద్ధంగా వివాహం చేసుకోకున్నా కొంతకాలంపాటు కలిసి జీవించినందుకు భరణానికి ఆమె అర్హురాలేనని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

తనతో సహజీవనం చేసిన మహిళకు ప్రతినెలా రూ. 1500 చెల్లించాలంటూ కిందికోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ హైకోర్టులో సవాలు చేశాడు. కేసును విచారించిన హైకోర్టు కిందికోర్టు తీర్పును సమర్థించింది. సహజీవనానికి సంబంధించిన ఆధారాలు లేవన్న కారణంగా భరణాన్ని నిరాకరించలేమని స్పష్టం చేసింది.

More Telugu News